ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నిన్న వెస్ట్ ఢిల్లీలోని వికాస్పురిలో దాడి జరిగింది. వికాస్ పూర్ లో ఆయన పర్యటిస్తుండగా కొందరు వ్యక్తులు పూలదండ వేస్తామని వచ్చి దాడికి పాల్పఢారని ఢిల్లీ సీఎం అతిశి తెలిపారు. ఇది కచ్చితంగా బిజెపి వారి పనేనని ఆప్ ఆరోపించింది. అయితే బిజెపి ఈ ఆరోపణలను ఖండించింది. ఆప్ ఇలాంటి చవక బారు ప్రచారాలు మానుకోవాలని ఢిల్లీ బిజెపి అధ్యక్షులు వీరేంద్ర సచిదవ్ ఆప్ కు తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కేజ్రీవాల్ ఇలాంటి ప్రచారాలు, దాడులు స్వయంగా చేయించుకుంటాడని గతంలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి కేజ్రీ వాల్ పై దాడి జరగడం వార్తాంశంగా మారింది.
