జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు మారం గంగారెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన సంతోష్ అన్న యువకుడిని నిందితుడిగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పాత కక్షలు భూ వివాదాల కారణాలతోనే సంతోష్ గంగారెడ్డిని హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు
