జగిత్యాల జిల్లా జాబీతాపూర్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులను శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మధుయాష్కి పరామర్శించారు. జగిత్యాల రూరల్ మండలంలోని జాబితా పూర్ గ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లిన మధుయాష్కి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆయనతోపాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు
