
(పిట్ట రాజేష్ తెలంగాణ సామ్నా)
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మేని ప్రణీత్ కుమార్ (39) గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో డివైడర్ కు ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేని ప్రణీత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
