
(బాలే అజయ్, తెలంగాణ సామ్నా)
గత మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాలోని విద్యా నికేతన్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కోరుట్ల విద్యార్థిని సిరిమల్ల హిమాని గైడ్ టీచర్ చంద నాగరాజు సహకారంతో నదుల పునరుజ్జీవనం కోసం రూపొందించిన మేనేజ్డ్ అక్యూఫెర్ రిఛార్జ్ ప్రాజెక్టు ఇన్ స్పైర్ విభాగంలో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.ఈ సందర్భంగా సిరిమల్ల హిమాని మరియు గైడ్ టీచర్ చంద నాగరాజులను జిల్లా విద్యాశాఖాధికారి రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, బాజోజి శ్రీనివాస్, మండల విద్యాధికారి నరేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
