(బాలే అజయ్ – 9290277727, మెట్పల్లి)
తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు శనివారం కోరుట్లలోని వై కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన జువ్వాడి నర్సింగరావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు కూడా పాల్గొని జువ్వాడి నర్సింగరావును అభినందించారు. పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
