(బాలే అజయ్ – 9290277727, మల్లాపూర్)
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ముత్యంపేట, రాఘవపేట, ఒబులాపూర్ తండా, మొగిలిపేట, ధామ్రాజ్‌పల్లి, వాల్గొండ, మల్లాపూర్, గొర్రెపల్లి, రేగుంట, సాతారం, చిట్టాపూర్, కుస్తాపూర్ గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, 36 మంది లబ్ధిదారులకు రూ.11.52 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
