
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, అనాథలకు సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ, దివ్యాంగులకు స్కూటీల అందజేత చేపట్టి జన్మదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని అష్టలక్ష్మి దేవాలయం, అనంతరం ఝాన్సీ రోడ్డులోని త్రిశక్తి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు నివాసంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జువ్వాడి నర్సింగరావు జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జన్మదినాన్ని పురస్కరించుకుని రేగుంట అనాథాశ్రమంలో అనాథలకు పండ్లు, బియ్యం పంపిణీ చేయగా, కాంగ్రెస్ నాయకుడు నేమూరి భూమయ్య ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్యాకెట్లు అందజేశారు. అలాగే 10వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత–రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.5,44,500 విలువైన ఆరు చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఇదే సందర్భంగా దివ్యాంగులైన గోరువంతుల నారాయణ, అజీజ్‌లకు ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన మోటరైజ్డ్ స్కూటీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూల సూత్రమని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.7.50 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధిని లబ్ధిదారులకు అందజేసినట్లు వెల్లడించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే పాత్రికేయులను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొంటూ, పాత్రికేయుడు గోరువంతుల నారాయణతో పాటు దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు అజీజ్‌కు స్కూటీలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.
జువ్వాడి నర్సింగరావు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని, ఉన్నత పదవులను అధిరోహించాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
