33.2 C
Hyderabad
Thursday, September 17, 2026
No menu items!

జగిత్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం

(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)

2026–27 సంవత్సరానికి గాను జగిత్యాల పట్టణ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది.

గత ఆదివారం స్థానిక కౌండిన్య బాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మోర భద్రేశం, జోన్ చైర్‌పర్సన్ (ZC) లయన్ తాటిపాముల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేయగా, బుధవారం నాడు వారు అధికారికంగా తమ బాధ్యతలను చేపట్టారు.

నూతన అధ్యక్షుడిగా లయన్ గుండేడి గంగాధర్, కార్యదర్శిగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి అడువాల జ్యోతి లక్ష్మణ్, కోశాధికారిగా పోతు గణేష్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.

ఇన్‌స్టాలేషన్ కార్యక్రమానికి జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చార్టర్డ్ ప్రెసిడెంట్ శ్రీరాములు సుదర్శన్, మాజీ అధ్యక్షులు వడ్లగట్ట శంకర్, మాజీ జెడ్పీటీసీ కుందారపు జలంధర్, అనుమల్ల విలాస్, మాజీ సర్పంచ్ ద్యావనపెళ్లి అభిలాష్ తదితర ప్రముఖులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి, సమాజాభివృద్ధికి లయన్స్ క్లబ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles