(బాలే అజయ్, 9290277727, కోరుట్ల)
గురువారం రాత్రి కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌రావుపేట గ్రామ శివారులో, జాతీయ రహదారి-63పై వాగు బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందనీ కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.
మేడిపల్లి గ్రామానికి చెందిన దోమల లక్ష్మణ్ తన ద్విచక్ర వాహనంపై మాచాపూర్ నుండి మేడిపల్లి వైపు వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించి, ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని CCTV కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.
