33 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

కోరుట్లలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

పట్టణంలోని పలు ఆలయంలతో పాటుగా పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ లో అర్బన్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఉట్టి పగులకొట్టించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిన్నారులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో ముద్దుముద్దుగా అలరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా అలంకరించి కార్యక్రమానికి తీసుకురావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

ఉట్టి తాడుకు కట్టి వేలాడదీసి ఉండగా, చిన్ని కృష్ణులు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారులు దానిని పగులగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల సందడి, ఉట్టి పగులకొట్టే వేడుకను తిలకించేందుకు వచ్చిన భక్తులకు కనువిందు చేసింది.

అనంతరం పంతులు మనోజ్ చారి కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

అర్బన్ కాలనీలో వార్డు కౌన్సిలర్ గూగులోవాత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్, అర్బన్ కాలనీ, బంజారా నగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు, పురుషులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles