
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం సాయంత్రం పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కోరుట్ల నియోజకవర్గ పీఓసీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, వీర మహిళ, హడక్ కమిటీ సభ్యురాలు వోడ్నాల సౌజన్య, మాసం విజయ్ కుమార్, దాసోహం అనిల్, కట్టా రంజిత్, తుమ్మ సురేష్, కోటగిరి సంపత్, గట్ల నరేష్, చిలువేరి మణిదీప్, ఉషా కొల్ల శశి, ప్రణీత్, సంజీవ్, రాకేష్, రాజు, రాజేందర్, గణేష్, నరహరి, ఆకుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
