

(తెలంగాణ సామ్నాడెస్క్) కోరుట్ల పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం బిజెపిలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం నుండే ఈ విషయమై లోలోపట తీవ్ర స్థాయిలో రాజకీయంగా చర్చ జరగడం ప్రారంభమైంది. తనకు వార్డును కేటాయించడంలో కాంగ్రెస్ అధిష్టానం విపరీత ధోరణి ప్రదర్శించిన కారణంగా మనస్థాపం చెంది భూషణం కాంగ్రెస్ ఆభరణాన్ని వదిలి బిజెపి కండువా కప్పుకొని కథను రంగంలోకి దూకాడు.
స్వతహాగా దైవభక్తి అధికంగా ఉన్న నాగభూషణం వేములవాడ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యునిగా ఉన్నప్పుడు కోరుట్ల పట్టణానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కోరుట్ల మెట్పల్లి జాతీయ రహదారి పై గోదాం వద్ద వేములవాడ రూట్లో ఏర్పాటు చేసిన ఆర్చరీ తో పాటుగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడంలో నాగభూషణం పాత్ర మరువలేనిదని ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తన వార్డులో వ్యక్తిగతంగా తనకు ఉన్న పరిచయాలతో పాటుగా తన సేవలను గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం వల్లే మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీనీ వదిలి తన భావాలకు ఆదర్శాలకు దగ్గరగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాడని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఈ ఎన్నికల వేడి నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తును మరింత గొప్పగా మలుచుకోవాలన్న ఉద్దేశంతో నాగభూషణం బిజెపి పార్టీలో ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో చేరారు అని ఆయన సన్నిహితులు “తెలంగాణ సామ్నా”కు తెలిపారు.
ఎంబేరి నాగభూషణం బిజెపి పార్టీలో చేరడం పట్టణంలో బిజెపికి కొత్త జోష్ నింపినట్టు అయిందని పార్టీ శ్రేణులు తెలిపాయి.
