
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పురపాలక ఎన్నికల్లో ఏడో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా గూగులావత్ శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు ముందుగా అర్బన్ కాలనీలోని శ్రీ దుర్గామాత దేవాలయం, పోచమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం తనను బలపరిచిన గుద్దేటి రాజేందర్‌తో పాటు అర్బన్ కాలనీ, బంజారా నగర్ కాలనీ, అయోధ్య పట్నం కాలనీ, కెసిఆర్ కాలనీ, ఆదర్శనగర్ ప్రాంతాల ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
