27.2 C
Hyderabad
Monday, September 14, 2026
No menu items!

కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాములు వార్షిక తనిఖీ

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణపై సమగ్ర పరిశీలన

ఆగస్టు 31: కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ A. రాములు సోమవారం వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించడంతో పాటు సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వార్షిక తనిఖీలో భాగంగా కేసులకు సంబంధించిన ఫైల్స్, వివిధ రకాల రిజిస్టర్లు, రికార్డులు, ఇతర ముఖ్యమైన దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్‌లో పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు అందించే పోలీస్ సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, అప్రమత్తతతో పనిచేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, చట్టపరంగా సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

వార్షిక తనిఖీ సందర్భంగా కోరుట్ల సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్యామ్ రాజ్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles