( బాలే అజయ్, కోరుట్ల, 9290277727)
కోరుట్ల పట్టణంలోని మనీబార్ & రెస్టారెంట్‌లో గురువారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో క్యాషియర్‌పై దాడి చేసి హత్యకు ప్రయత్నించిన కేసులో *బింగి అలియాస్ బంగి నగేష్ (24)ను అరెస్ట్ చేసినట్టు కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.
బార్‌లో బీర్ ఇవ్వాలని క్యాషియర్‌ను దుర్భాషలాడిన నిందితుడు, అతను ప్రశ్నించడంతో తన చేతికి ఉన్న స్టీల్ కడియంతో ముఖంపై దాడి చేసి గాయపరిచాడనీ ఎస్సే తెలిపారు. అనంతరం బీర్ బాటిల్‌తో తలపై కొట్టేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనను ప్రత్యక్ష సాక్షులు గమనించారు.
బాధితుని ఫిర్యాదు మేరకు హత్య యత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని శుక్రవారం కోరుట్లలో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దాడికి ఉపయోగించిన స్టీల్ కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
నిందితుడిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉండటంతో కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ కూడా కొనసాగుతోందని ఎస్సే శ్యామ్ రాజ్ తెలిపారు.
