(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మాదాపూర్‌కు చెందిన అలెపు రమేష్ (32) మృతి చెందినట్లు కోరుట్ల ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. గంగరాజం పెద్ద కుమారుడు రమేష్ కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటూ సుమారు నెల రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గత కొన్ని రోజులుగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆదివారం రాత్రి రమేష్ మద్యం సేవించిన అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అలాగే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
