(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన నల్లూరి నరేష్ (24), తండ్రి ఆనంద్, వృత్తి డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 23, 2026 తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో నరేష్ తన స్నేహితుడి బైక్‌పై మెట్పల్లి పట్టణంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి డెకరేషన్ పనుల కోసం బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కోరుట్లలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
జాతీయ రహదారిపై ఎలాంటి హెచ్చరిక సిగ్నల్స్ లేదా భద్రతా సూచనలు లేకుండా లారీని నిర్లక్ష్యంగా ఆపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందున్న లారీని గమనించలేక నరేష్ వెనుక నుంచి ఢీకొట్టడంతో అతనికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ మృతుని తల్లి నల్లూరి యమున ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
