23.4 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

కోరుట్ల డి-ఫోర్టీ కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డి-ఫోర్టీ కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. మృతుడు మేడిపల్లి గ్రామం, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మామిడి రాజ్‌కుమార్ (38) తండ్రి లెట్. నరసయ్యగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 21, 2026 మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో రాజ్‌కుమార్ తన తల్లిని మద్యం కోసం డబ్బులు అడగగా డబ్బులు లేవని తల్లి చెప్పడంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
ఫిబ్రవరి 23, 2026 మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో కోరుట్లలోని డి-ఫోర్టీ కాలువలో ఓ మృతదేహం కనిపించిందని గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీశారు. పరిశీలనలో మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు మృతుడు రాజ్‌కుమార్ అని నిర్ధారించారు.
మృతుడు మద్యం వ్యసనానికి బానిసై, జీవితంపై విరక్తితో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మృతుడి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles