37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్లలో పేకాట రాయుళ్లపై మెగా రైడ్స్! – పోలీసుల అదుపులో 11 మంది

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలో పోలీసులు పేకాట స్థావరాలపై కఠిన చర్యలు చేపట్టారు. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకొని భారీగా నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మొదటి ఘటనలో, మాదాపూర్ గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట ఆడుతున్నారన్న ఖచ్చిత సమాచారం మేరకు కోరుట్ల పోలీసులు, జగిత్యాల సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 1). పేర్ల శరత్ బాబు (40) తండ్రి కిషన్ రావు, 2). అబ్దుల్ రెహమాన్ (43) తండ్రి జైనువుద్దీన్, 3). నాంపల్లి శ్రీధర్ (46) తండ్రి వెంకటాద్రి, 4). గాంధారి శ్రీనివాస్ (40) తండ్రి రాజ్యం అను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.98,200 నగదు మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక రెండో ఘటనలో, కోరుట్ల ఆనంద్ నగర్ శివారులోని వ్యవసాయ భూమిలో పేకాట జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మళ్లీ దాడి చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 1). పొట్లా గోపి (42) తండ్రి నరసయ్య, 2). పుడారి శ్రీనివాస్ (55) తండ్రి కటయ్య, 3). జక్కుల రవి (40) తండ్రి మల్లయ్య, 4). మహమ్మద్ రహీముద్దీన్ (48) తండ్రి బషీరుద్దీన్, 5). లోకిని పోశయ్య (48) తండ్రి బాజరయ్య, 6). షెల్కే లక్ష్మణ్ (36), తండ్రి మధు, 7). ఆక్లారే వీరప్ప (64) తండ్రి రామ్ శెట్టి అను ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి రూ.7,010 నగదు మరియు 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తెలిపారు. పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి రాజీ ఉండదని, ఇలాంటి దందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సురేష్ బాబు మరియు ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles