27.9 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

కోరుట్లలో గంజాయి సరఫరా చేస్తూన్న నలుగురు అరెస్ట్

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల పట్టణంలో గంజాయి సరఫరా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో కోరుట్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఎం. చిరంజీవి సిబ్బందితో కలిసి కల్లూరు రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు బైక్‌లపై గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో, ఒక గుర్తు తెలియని (పరారీలో ఉన్న) వ్యక్తి నుంచి గంజాయిని తీసుకుని కోరుట్ల మండలం మరియు పట్టణ ప్రాంతాల్లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టు వెల్లడైంది.
అరెస్ట్ అయిన వారు:
పసుపుల మణి సాయి (20 సం.), తండ్రి: విజయ్, నివాసం: కల్వగడ్డ, కోరుట్ల
కండ్లె రోహిత్ (20 సం.), తండ్రి: నరేష్, నివాసం: అంబేద్కర్ నగర్, కోరుట్ల
బుయ్య దీపక్ (20 సం.), తండ్రి: మధు, నివాసం: కల్లూరు గ్రామం, కోరుట్ల మండలం
వనతడుపుల మనోహర్ (18 సం.), తండ్రి: అశోక్, నివాసం: కల్లూరు గ్రామం, కోరుట్ల మండలం
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై చిరంజీవి గారు తెలిపారు.
గంజాయి అమ్మకం, సరఫరా, వినియోగంలో పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే హిస్టరీ షీట్లు, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికే పలువురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు, ఇకపై కూడా ఇలాంటి కార్యకలాపాలపై కఠిన వైఖరి అవలంబిస్తామని తెలిపారు.


(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.) సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles