36.1 C
Hyderabad
Monday, June 15, 2026
No menu items!

కోరుట్లలో కారు డీల్ పేరిట మోసం నాలుగున్నర లక్షలు ఎగవేత: కేసు నమోదు

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా కోరుట్లలో “జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ” ని లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన మూటపలుకుల వెంకట్ అనే వ్యక్తి, రిపోర్టర్‌గా చలామణి అవుతూ కన్సల్టెన్సీ వద్దకు వచ్చి రెండు కార్లు తీసుకుని డబ్బులు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
మొదటగా హుండాయ్ క్రెటా కారును తీసుకుని రూ.2.50 లక్షలు చెల్లించకుండా ఉండగా, అనంతరం గ్రాండ్ ఐ-10 కారును తీసుకుని రూ.2.15 లక్షలు బకాయిగా ఉంచాడు. ఈ విధంగా మొత్తం రూ.4.65 లక్షలు ఎగవేత చేసినట్లు యాజమాన్యం ఆరోపిస్తోంది.
బకాయిల కోసం వెళ్లిన జై భజరంగ్ కారు కన్సల్టెన్సీ యజమానులు చెక్కపల్లి నవీన్, కుర్ర ఆంజనేయులను కూడా వెంకట్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ఇదే వ్యక్తి కార్లు కొనుగోలు చేసి డబ్బులు సమయానికి చెల్లించడంతో నమ్మకంతో మళ్లీ వాహనాలు ఇచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ఈసారి అదే నమ్మకాన్ని ద్రోహం చేస్తూ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.
బుధవారం చెక్కపల్లి నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. ఘటనపై పూర్తివివరాలు సేకరించిన ఎస్సై చిరంజీవి, మూటపలుకుల వెంకట్‌పై చీటింగ్ మరియు బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles