(బాలే అజయ్ కోరుట్ల)
కోరుట్ల పట్టణంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.
పట్టణంలో ఉన్న మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలను పంపిణీ చేస్తున్నారు. ఒకే రకమైన నాణ్యత, రంగుతో యూనిఫామ్ పద్ధతిలో చీరలు ఉండడంతో మహిళలు చీరల కోసం పోటీ పడిన వాతావరణం కనిపించడం లేదు.
ఆయా సంఘాలకు సంబంధించిన ఆర్ పీ లు సభ్యులకు చీరలను పంపిణీ చేస్తున్నారు.
అయితే చీరల నాణ్యత బాగా లేదనే విమర్శ వస్తున్నది. దీనితో పాటు మహిళా ఉన్నతి ..తెలంగాణ ప్రగతి అనే నినాదం ఇస్తున్న ప్రభుత్వం.. సొమ్ము ప్రభుత్వానిది ..పేరు ఇందిరమ్మది అయినప్పుడు కానుక వ్యక్తిగతంగా పంపినట్టు రేవంతన్న కానుక అని ప్రకటించుకోవడం పట్ల కొంత విమర్శ వస్తున్నది.
