(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
శ్రీరామనవమి సందర్భంగా అరుణాచలం దేవస్థానం సౌజన్యంతో ఫిబ్రవరి 27న ఆలయంలో మెట్‌పల్లి పట్టణానికి చెందిన నటరాజ నృత్య కళానిలయం విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పదిమంది చిన్నారులు అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన చిన్నారులను బంగారు పతకాలతో సన్మానించారు. అనంతరం శుక్రవారం రోజు మెట్‌పల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు చిన్నారులను కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అలాగే పార్టీకి చెందిన వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
