(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విలీన గ్రామమైన ఎఖీన్‌పూర్ 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన కౌన్సిలర్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కౌన్సిలర్ కార్యాలయం ఏర్పాటుచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహ్మద్, స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి, ఇతర వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
