
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ, శ్రీ హనుమాన్ దేవాలయంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. “సనాతన ధర్మ ప్రచార సమితి” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
అర్చకులు బ్రహ్మశ్రీ దివాకర్ శర్మ, శ్రీమతి పూర్ణిమ వైదిక మంత్రాలతో పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం భక్తి, సేవా భావంతో విజయవంతమైంది.
