(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తిరుమల వసంత గంగాధర్‌ను బీసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, సాల్వా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న నాయకుడిగా తిరుమల గంగాధర్ ఎదిగారని, ఆయన నాయకత్వంలో కోరుట్ల అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చైర్మన్‌గా ఎన్నుకోబడటంలో జువ్వాడి బ్రదర్స్ తీసుకున్న నిర్ణయం నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందన్నారు.
ప్రజా సేవ పట్ల అంకితభావంతో పనిచేసే నాయకత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, కోరుట్ల పట్టణ అధ్యక్షులు బాలే అజయ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లా మమత మరియు నందగిరి రవి తదితరులు పాల్గొన్నారు.
