(తెలంగాణ సామ్నా డెస్క్)
కోరుట్ల కాంగ్రెస్ లో నుండి ఓ నమ్మకమైన “చేప” జారిపోతునట్టు విశ్వసనీయ సమాచారం. జువ్వాడి కుటుంబానికి ఎంతో నమ్మకంగా సదరు చేప కు స్థానికంగా మంచి పేరు ఉండడంతో పాటుగా ధర్మము విషయంలో నిజాయితీగా ఉంటాడనే పేరు ఉంది. దానితో పాటుగా కాంగ్రెసు ముఖ్య నాయకులకు ఎంతో నమ్మకమున్న వ్యక్తిగా పేరున్న సదరు “నాయక చేప” కాంగ్రెస్ హస్తాల నుండి జారిపోయి కమలం నీడన సేద తీరి రాబోయే ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేయాలనీ అనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు శుక్రవారం జగిత్యాల లో జరిగే బీజేపీ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆ పార్టీ లో చేరుతున్నట్టు సమాచారం
