ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 12600 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లాలోని మీట్ మానేరు జలాశయానికి ఎత్తిపోస్తున్నట్టుగా సమాచారం. ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి వరద తీవ్రత పెరగడంతో మిడ్మనేరుకు నీటిని పంపించేస్తున్నట్టుగా తెలుస్తుంది. శనివారం సాయంత్రం వరకు అధికారులు నాలుగు మోటర్లను మేడారంలో ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అక్కడినుండి నంది మేడారం ద్వారా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తారు అక్కడి నుండి మోటర్లు ఆన్ చేసి మేటు మానేరుకు నీటిని పంపింగ్ చేస్తారు.
