తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి ప్రయత్నిస్తుందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో 1.09 లక్షల కోట్ల నిధులు కేంద్రాననివే ఉన్న పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీ తీర్మానం చేయడం లోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత పది ఏళ్లలో రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని ఆయన అన్నారు.
