తెలంగాణ సామ్నా బ్యూరో; ఎక్కడో కేరళలోని తిరువనంతపురంలో ఓ వ్యక్తి ఐదుగురిని హత్య చేశాడన్న వార్త చాలామందిని కలవరపెట్టిందనే చెప్పవచ్చు. కాని తెలంగాణలోని కాజీపేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని హత్య చేయించాలని చూసిన మహిళ గురించి తెలిసి చాలామంది నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. నేరాలకు ఘోరాలకు విదేశాల్లో జరిగిన సంఘటనలనో లేదా వేరే రాష్ట్రంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేని “స్వగృహ నేర ఉత్పత్తి రాష్ట్రంగా” తెలంగాణను తీసుకెళుతున్నారన్న పరిస్థితి ఎర్పడుతోందన్న విమర్శ వస్తున్నది. ఓ భార్య తన భర్తను హత్య చేయించడానికి ప్రియునితో పన్నిన కుట్రను పోలీసులు చేధించడంతో విషయం తెలిసిన ప్రజలు విస్తుపోతున్నారు.
వివరాల్లోకి వెళితే..,సుమంత్‌రెడ్డి ఒక యువ డాక్టర్. తన వైద్య విద్యను పూర్తయ్యాకా సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయసాగాడు. కొద్ది కాలం తరువాత అతనికి ప్లొరా మరియ అనే యువతితో పరిచయం ఏర్పడిOది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వారు వివాహం చేసుకున్నారు. ఇంతవరకు వారిద్ధరి జీవితం బాగానే వుంది. ఆ తరువాతే అసలు కథ మొదలయ్యింది. తన ఫిట్నెస్ కాపాడుకోవడం కోసం ప్లొరా మరియ సంగారెడ్డిలో వున్న ఓ జిమ్‌కు వెళ్లడం ప్రారంభించింది. అక్కడే వున్న జిమ్ శిక్షకుడు సామ్యూల్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో భార్యలో వస్తున్న మార్పును గమనించి సుమంత్‌రెడ్డి మరియను మందలించాడు. ఆమెలో ఏ మార్పు కానారాలేదు. సంగారెడ్డిలో వుంటే పరిస్థితి మారే అవకాశం లేదని గమనించుకున్న సుమంత్‌రెడ్డి తన ప్రాక్టీస్‌ను కాజీపేటకు మార్చాడు. ఇది జరిగి మూడు సంవత్సరాలు కావచ్చింది. ఈ మధ్యకాలంలో మరియకు ఒక రెసిడెన్షియల్ పాఠశాలలలో టీచర్‌గా ఉద్యోగం దొరికింది. దీనితో మరియకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశ్యంతో రెసిడెన్షియల్ పాఠశాలకు దగ్గరలోనే తమ నివాసం కోసం రూమ్ తీసుకున్నాడు సుమంత్‌రెడ్డి.
భార్య మంచి కోసం సుమంత్‌రెడ్డి ఎన్ని రకాలుగా ఆలోచించినా, మరియ బుద్ధి మారలేదు. భర్త మందలించినా పద్ధతి మారలేదు. సంగారెడ్డి నుండి సామ్యూల్ తరచు వచ్చి మరియను కలిసి వెళ్లేవాడు. అయితే ఇక్కడే మరియ బుద్ధి వంకరగా ఆలోచించింది. భర్త బ్రతికుంటే ఎప్పటికైనా ఇబ్బంది అని శామ్యూల్‌తో కలిసి ఆలోచించింది. ఏలాగైనా సుమంత్‌రెడ్డిని తమ జీవితాలనుండి అడ్డు తొలగించుకోవాలని ఇద్ధరు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం శామ్యూల్ స్నేహితుడైనా ఓ కానిస్టేబుల్ సహయం తీసుకున్నారు. పకడ్బంది ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 20 తేదీన దారి కాచి సుమంత్‌రెడ్డిపై దాడి చేశారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రికరించాలనే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి మరణించాడని వారు అక్కడి నుండి వెల్లిపోయారు. అయితే కొన ఊపిరితో వున్న సుమంత్‌రెడ్డిని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో భర్తను హత్య చేయించడానికి భార్య ప్రియునితో పాటుగా అతని స్నేహితుని ద్వారా చేసిన కుట్రకోణం బయటపడిరది. మరియ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు పలు కోణాల్లో కేసు విచారిస్తున్నారు.హత్యాయత్నం చేసి పారిపోయిన నిందితులను బెంగుళూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సుమంత్‌రెడ్డి భార్య మరియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు వున్నట్లు తెలుస్తున్నది. యిష్టపడి పెళ్లి చేసుకున్న భార్య, ప్రియుడి మోజులో పడి, నమ్మి ప్రేమించిన భర్తను హత్య చేయించడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
శారీరక సౌందర్యం మోజులో ఫిట్నెస్ పేరున జిమ్‌లో చేరుతున్న మహిళలు, వారి కుటుంబ సభ్యులు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిమ్‌లు ప్రత్యేకించి ఓ వర్గం మహిళలను లోభర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో నెలకొల్పుతున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో జాగ్రత్త వహించాలనే భావనలు వస్తున్నాయి.
