(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్లలో గత నెల ఏప్రిల్ 24వ తేదీ రాత్రి జరిగిన అడ్వకేట్ గంగుల సత్యార్థ ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టిన కోరుట్ల పోలీసులు, దాడికి పాల్పడిన నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్టు చేసిన నిందితులను సంబంధిత కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌కు పంపబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:
1). కైరీ లత,
2). అరికొప్పుల శేఖర్,
3). మాగాని మహేందర్,
4). కుంచపు వెంకటేష్ అలియాస్ డ్యని ఉన్నారు.
ఇంకా ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. వారిని త్వరలో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. చిరంజీవి తెలిపారు.
