26.2 C
Hyderabad
Monday, August 3, 2026
No menu items!

వాయనాడు రెస్క్యూ టీం లోని ఇద్దరూ స్వయంసేవకుల మృతి

కేరళ లోని వాయనాడు లో జరిగిన ప్రకృతి విలయం ఘటనల్లో సేవలు అందిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కు చెందిన ఇద్దరు అమరులైనట్టుగా సమాచారం అందుతుంది. కొద్ది రోజుల క్రితం కొండ చర్యలు విరిగిపడి ప్రకృతి విలయ తాండవం చేసి వందల మంది మృతి చెంది వందలాది ఇల్లు నీలమట్టమైనా వాయనాడు దుర్ఘటనలో వేలాధిగా స్వయం సేవకులు సేవలు అందిస్తున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో అక్కడ సేవలు అందిస్తున్న రాజేష్ శరత్ అనే స్వయం సేవకులు చిన్నపిల్లలను రక్షిత ప్రాంతానికి చేర్చారు. ఇంకా ఎవరైనా ఉన్నారా చూడడానికి వెళ్ళిన క్రమంలో కొండ చర్యలు మళ్లీ విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో వారిద్దరూ మరణించినట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి 500 మీటర్ల దూరంలో ప్రదీష్ దేహాన్ని గుర్తించారు. శరత్ ఆనవాళ్లు ఇంకా దొరకలేదు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles