అసలుకు నాలుగు రెట్లు ఎక్కువగా నకిలీ నోట్లు ఇస్తామని కొందరిని మోసం చేసిన ముఠాను జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది నెలలుగా నకిలీ నోట్లు ఇస్తామని మోసం చేసిన జగిత్యాలకు చెందిన సంజీవ్ శివకుమార్ కిషన్ గంగారాం మల్లయ్య అశోకులను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెట్పల్లి శివారు పెద్ద గుండు వద్ద వ్యాపారం నిర్వహించే రాజేందర్ అనే వ్యక్తి నుండి రూపాయలు లక్ష తీసుకొని మోసం చేశారు. అతడి ఫిర్యాదు మేరకు శుక్రవారం నిందితులను మెట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రూపాయలు ఏడు లక్షలు గల 500 నకిలీ నోట్లను ఆరు సెల్ ఫోన్లను బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు తెలిపారు.
