జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఆదివారం రాత్రి యువకుడి దారుణ హత్య సంఘటన జరిగింది. గూడూరు కు చెందిన రాజశేఖర్ గౌడ్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలాన్ని సిఐ నీలం రవి సోమవారం పరిశీలించి హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
