
(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
మెట్పల్లి పట్టణంలోని 9వ మరియు 14వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా రజాక్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. అలాగే 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాన్కాల ప్రశాంత సావర్కర్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలోనూ పాల్గొని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
