
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ బుధవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అడ్డా బాయ్స్ యూత్ వద్ద 26, 27, 28 వార్డుల కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన 1, 12, 13 వార్డుల కార్నర్ మీటింగ్‌లోనూ పాల్గొని, కోరుట్ల పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు గుర్తు చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రస్తావించిన ఎమ్మెల్యే, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి ఘన విజయం సాధింపజేయాలని ప్రజలను కోరారు.
