
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడానికి పోలీసులు పురవీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు ఈ ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, డీఎస్పీ అడ్లూరి రాముడు పాల్గొన్నారు. వీరితో పాటు పలు మండలాలకు చెందిన సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది కూడా పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు ఎన్నికల సమయంలో ఎలాంటి అపోహలు, అశాంతి పరిస్థితులు సృష్టించకుండా సహకరించాలని సూచించారు. చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
