32.1 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

మత్స్యకారుల ఆశలపై బడ్జెట్ నీళ్లు.. నిధుల కోతపై బీజేపీ ఆగ్రహం

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్‌పై మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించిందని బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ తీవ్రంగా విమర్శించింది. బడ్జెట్‌లో అంకెల గారడీతో మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బతీస్తున్నారని ఆరోపించింది.
గత ఆర్థిక సంవత్సరంలో మత్స్యశాఖకు కేటాయించిన ₹1,980 కోట్ల బడ్జెట్‌ను ఈ ఏడాది ₹1,529 కోట్లకు తగ్గించడం పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకార రంగానికి ₹2,761.80 కోట్లు కేటాయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా విడుదల చేయకపోవడం వల్ల పథకాలు అమలులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా చేప పిల్లల సరఫరాదారులకు సుమారు ₹100 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల సంబంధిత వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. లక్షలాది మత్స్యకార కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకోకుండా రూపొందించిన ఈ బడ్జెట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తన వాటా నిధులు విడుదల చేసి, మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రకటనను బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి ఇట్యల నవీన్ కుమార్ విడుదల చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles