29.1 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

“పెట్రోల్ కష్టాలు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!”

(వాసం మృత్యుంజయ, భాగ్యనగర్ సెంట్రల్ బ్యూరో

బంకుల వద్ద బారులు తీరొద్దు… సేఫ్ గా బస్ ఎక్కండి… సుఖవంతమైన ప్రయాణం చెయ్యండి : టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై. నాగిరెడ్డి ఐపీఎస్ గారి పిలుపు.

ప్రయాణికులకు బంపర్ ఆఫర్… హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ : టీజీఎస్ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై. నాగిరెడ్డి ఐపీఎస్.

          ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ విసి & ఎండి శ్రీ వై. నాగిరెడ్డి, ఐపీఎస్ గారు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన “పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

“ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు…”

“సమయం & ఇంధనం ఆదా … క్యూ లైన్లకు స్వస్తి”

పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles