37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

యూసఫ్ నగర్ లోఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల మండలం యూసుఫ్ నగర్(ఈశ్వర్ నగర్) గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బుధవారం ఇంటి యజమానురాలు చొప్పరి లక్ష్మీ గృహప్రవేశం నిర్వహించింది. ఇట్టి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విచ్చేసి నూతన గృహప్రవేశం చేపట్టిన చొప్పరి లక్ష్మీ జయకృష్ణ లకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేసే పార్టీ అని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరిగిందని అన్నారు. ప్రోసిడింగ్ పత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇంటి గృహ నిర్మాణాలు చేపట్టుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లు పొందే అర్హత కలవారు ఉంటే వారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియాన్ని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ స్థానిక నాయకులు ముక్కెర లింబాద్రి గుగ్గిల సురేష్ గౌడ్ గోపు సురేష్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కుటుంబ సభ్యులు చొప్పరి లక్ష్మి జయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles