27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో ఊరేగింపు… సీతమ్మవారికి విశేష భక్తి సమర్పణ

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

శ్రీరామనవమి సందర్భంగా శ్రీవల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని భక్తి పారవశ్యంతో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివమార్కండేయ కోటినవ దుర్గ దేవాలయం నుండి సీతమ్మవారికి తలంబ్రాలు, ఒడిబియ్యం, సారె, పట్టు వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ సీతారామాలయం వరకు తీసుకెళ్లారు.
ఈ ఊరేగింపులో సుమారు 500 మంది సేవకులు పాల్గొని కోలాటం, నృత్య ప్రదర్శనలతో భక్తి వాతావరణాన్ని సృష్టించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ అధ్యక్షులు గుంటుక ప్రసాద్, దేవాలయ కమిటీ చైర్మన్ జిల్లా ధనుంజయ్, సంఘ ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, డైరెక్టర్లు పడాల గణేష్, యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ కుమార్, ఆలయ కమిటీ డైరెక్టర్ ఆడెపు నరేష్ కుమార్, యువత సహాయ కార్యదర్శి రాడం మహేందర్, సీతారామాలయ చైర్మన్ వనతడుపుల మురళి, శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ముక్క దామోదర్, అడ్వాల ప్రభాకర్, చిద్రాల రాము, సంకట మల్లయ్య, భీమనాతి రవి, జడల సమ్మయ్యతో పాటు శ్రీవల్లి సేవాసంస్థ సభ్యులు పుష్పలత, జమున తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles