
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్ జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 1362/TSEC–ULBs/2025 (తేదీలు: 29-12-2025 మరియు 07-01-2026), అలాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులకు సంబంధించిన తుది ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని, 01 అక్టోబర్ 2025 వరకు అర్హత కలిగిన ఓటర్ల వివరాలతో ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తేదీ 12 జనవరి 2026న తుది ఫోటో ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు.
ఈ తుది ఓటర్ల జాబితా పత్రాలను ప్రజల సమాచారార్థం కోరుట్ల మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం – కోరుట్ల, అలాగే తాసిల్దార్ కార్యాలయం – కోరుట్లలోని నోటీస్ బోర్డులపై ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు.
ప్రజలు తమ పేర్లు, చిరునామా వివరాలు పరిశీలించుకోవాలని, ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే సంబంధిత కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
