(బాలే అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల మేడిపల్లి జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుండి కోరుట్ల వైపు వస్తున్న ఏపీ 15 ఏ డబ్ల్యూ 7561 అనే నెంబర్ గల కారు ఒక బైక్ను ఢీకొని ఎదురుగా ఉన్న చెట్టును కూడా ఢీ కొట్టింది.
దీనితో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కారులో ఉన్న డ్రైవర్ సహా మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుని అంబులెన్స్ ద్వారా జగిత్యాల్ తరలించారు. గాయపడ్డ వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


