
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద గారి విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు మనకందరికీ ఆదర్శమని అన్నారు. నిర్వీర్యమైన భారత జాతిలో చైతన్యం నింపిన స్పూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
