(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంగళవారం ధర్మారం గ్రామంలోని “సురభి గోమాయి గోశాల” క్షేత్ర పర్యటనను నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వహకులు శ్రీమతి రజిత మహిపాల్ విద్యార్థులకు గోశాల నిర్వహణ విధానాలు, గో ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన కామర్స్ అధ్యాపకులు ఏ. లక్ష్మణ్, డైరీ సైన్స్ అధ్యాపకురాలు పి. మమతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గోశాల ఆధారిత ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సాధ్యాసాధ్యాలపై విద్యార్థులకు స్పష్టమైన దృక్పథం ఏర్పడిందని అధ్యాపకులు తెలిపారు.
ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పై అవగాహన కల్పించినందుకు కళాశాల ప్రిన్సిపల్ నడికట్ల సందీప్, వైస్ ప్రిన్సిపాల్ ముత్యంరెడ్డి కార్యక్రమ నిర్వాహకులను మరియు అధ్యాపకులను అభినందించారు.
