(బాలె అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
తెలంగాణలో మంగళవారం పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ఉదయం నుంచే నో డ్యూ సర్టిఫికెట్లు పొందేందుకు పురపాలక సంఘ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాల సేకరణలో అభ్యర్థులు బిజీగా కనిపించారు.

ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రాములు
కోరుట్ల పురపాలక సంఘంలో కొనసాగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను డి.ఎస్.పి రాములు బుధవారం పరిశీలించారు.
డి.ఎస్.పితో పాటు సీఐ సురేష్‌బాబు, ఎస్సై చిరంజీవి తదితర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను వారు సమీక్షించారు.

