27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

అదేంటో… ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్‌పై దాడులు!

తెలంగాణ సామ్మ బ్యూరో: కొందరికి పాము గండం వుంటుంది. మరికొందరికి తేలు గండం వుంటుంది. ఇంకొందరికి దెబ్బల గండం వుంటుంది. అందుకే కొందరు బయటకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు గండాలు వున్నాయా లేవా అని చూసుకొని వెళతారు. కాని విచిత్రమైన విషయం ఏమిటంటే. డిల్లీ మాజీ సిఏం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు దెబ్బల గండం వున్నట్లుగా వుంది. అది ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లినపుడు మాత్రమే ఈ గండం ఉరికురికి పనిగట్టుకొని ముందుకు వస్తండడం విశేషం.


ఒకసారి ఎన్నికల ప్రచారంలో సిరా చల్లే వారు ఒకరు వస్తే, మరోసారి చెప్పులు విసిరేవాడు వస్తాడు. అయ్యో పాపం కేజ్రీవాల్‌ను క్రేజీవాల్‌ను చేస్తున్నారు ఏంటి అని జనం అనుకునేలోగా ఎవరో ఒకరు ప్రచారరథం ఎక్కి చెంప పగులగొడతాడు. మొత్తానికి ప్రతి ప్రచారంలో ఎప్పుడో ఒకప్పుడు కేజ్రీవాల్‌పై ఎదో ఒక రకమైన బౌతికదాడి జరగడం సాధారణం అయిపోయింది. దానికి అమ్ముడుపోయిన ఓ విభాగపు మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం అనవాయితీగా జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో కొంత సానుభూతి సంపాదించుకొని తద్వారా ఓట్లు సంపాదించుకొని ఆ తరువాత పదవి సంపాదించుకునే సరళమైన రాజకీయ ఎత్తుగడగా దీనిని కొందరు విశ్లేషిస్తున్నారు.


అయితే ఆప్‌ మటుకు బీజేపి అభ్యర్థి ప్రవేశ్‌ వర్మ గుండాలు ఇటుకలు, రాళ్లతో కేజ్రీవాల్పఐ దాడి చేసి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారని చెబుతుంది. మీ దాడులకు భయపడం. ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెబుతారు అని ‘‘ఎక్స్‌’’లో నిప్పుల కుప్పయ్యింది ఆప్‌.
ఇదిలా వుండగా ఇంతవరకు కేజ్రీవాల్‌ మీద జరిగిన దాడులు ఎందుకు జరిగాయి? ఏలా జరిగాయి? జరిగిన వాటిపై ఎలాంటి చర్య తీసుకున్నారు? అనే విషయంపై కేజ్రీవాల్‌ అడగకపోవడం ఆశ్చర్యంగా వుందన్న వాదన వస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles