జన్వాడ ఫామ్ పార్టీ కేసులో ముద్దాయి అయినా రాజు పాకాల కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజ్ పాకాల పిటిషన్ మేరకు ఆయన పోలీసుల ముందు హాజరు కావడానికి హైకోర్టు రెండు రోజుల సమయం ఇచ్చింది. అయితే తాను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు బావమరిది అనే కారణంతోనే టార్గెట్ చేశారని రాజ్ పాకాల తరపు న్యాయవాది మయూర్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. తన క్లైంట్ ను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
