మహారాష్ట్రకు మహాయుతి ప్రభుత్వం శత్రువు లాంటిదని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. సమిష్టి వ్యూహాన్ని రచించి మహాయుతి ప్రభుత్వాన్ని గద్దదించేందుకు కలిసి పని చేయాలని ఎంబీఏ మిత్రపక్షాలకు ఆయన సూచించారు. మహాయుతి కూటమిని ఓడించి మహారాష్ట్రలో మతతత్వ వెన్నుపోటు రాజకీయాలనుంచి విముక్తి కల్పిస్తామని ఆయన తను పంపించిన పోస్టులో తెలిపారు
